Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతిష్టాత్మక సింటెక్స్ వాటర్ ట్యాంక్‌ల నకిలీ, అనుకరణ ఉత్పత్తులను దాడి చేసి పట్టుకున్న వెల్స్పన్

image
, శనివారం, 5 ఆగస్టు 2023 (16:15 IST)
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థల్లో ఒకటైన వెల్‌స్పన్ వరల్డ్ ఇటీవలనే సింటెక్స్ బిఎపిఎల్‌ను కొనుగోలు చేసింది. సింటెక్స్ బ్రాండ్ పేరుతో ప్లాస్టిక్ నీటి నిల్వ ట్యాంకులను సింటెక్స్ బిఎపిల్ తయారుచేసి విక్రయిస్తుంది. సింటెక్స్ నేడు ప్రతి ఇంటి పేరుగా మారటంతో పాటుగా నీటి నిల్వ ట్యాంక్ వర్గానికి పర్యాయపదంగా మారింది. తెలంగాణలోని మేడ్చల్ జిల్లా వద్ద 'సింటెక్' అని లేబుల్ చేయబడిన నకిలీ నీటి ట్యాంకులను వెల్‌స్పన్  బృందం గుర్తించింది.
 
వెల్‌స్పన్ బృందం నకిలీ ఉత్పత్తుల వ్యాప్తిని అంతం చేయడానికి ఈ మోసాన్ని గుర్తించి, వెలికితీసింది. అన్ని పరిశ్రమలలోనూ నకిలీ ఉత్పత్తులు అనేవి  అతిపెద్ద సవాళ్లలో ఒకటిగా నిలుస్తున్నాయి. వాటర్ ట్యాంక్ పరిశ్రమ దీనికి మినహాయింపు కాదు. సింటెక్స్ యొక్క ఈ టేకోవర్‌తో, వెల్‌స్పన్ వరల్డ్ అత్యుత్తమ నాణ్యత, ప్రామాణికతతో పరిశ్రమలో అత్యుత్తమ నీటి నిల్వ ట్యాంక్ పరిష్కారాలను అందించడం ద్వారా తన వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారుల సమక్షంలో విచారణ, దాడులు నిర్వహించబడ్డాయి. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. జిల్లాలో ఇలాంటి నకిలీ నీటి నిల్వ ట్యాంకుల తయారీదారులు, సరఫరాదారుల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. నాణ్యత హామీ కోసం నిజమైన సింటెక్స్  బ్రాండెడ్ వాటర్ ట్యాంక్‌లను ధృవీకరించుకోవాలని వెల్‌స్పన్ వినియోగదారులను, రిటైలర్‌లను గట్టిగా కోరుతుంది. ఇటువంటి నకిలీ ఉత్పత్తుల వ్యాప్తిని ఆపడానికి, వెల్‌స్పన్ సంస్థ యొక్క ఇమెయిల్ చిరునామాకి నకిలీ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారం అందించాలని ప్రజలను కోరుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ మాజీ ప్రధానికి మూడేళ్ల పాటు జైలు శిక్ష