Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ ప్రథమ మహిళగా గద్వాల్ విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరణ

Advertiesment
Vijayalaxmi Gadwal
, సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (18:38 IST)
గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలతలు సోమవారం పదవీ భాద్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలోని 7వ అంతస్తులో మేయర్ చాంబర్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మేయర్‌గా గద్వాల్ విజయలక్ష్మి మేయర్ పదవి ఛార్జ్ తీసుకునే ఫెయిల్‌పై తొలి సంతకం చేశారు. 
 
ఈ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, పార్లమెంటు సభ్యులు కె.కేశవ రావు, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేటి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, శాసన సభ్యులు దానం నాగేందర్, కార్పొరేటర్లు హాజరై మేయర్ విజయ లక్ష్మిని అభినందించారు. 
 
నగరంలోని పలువురు ప్రముఖులు, వివిధ శాఖలకు చెందిన అధికారులు మేయర్ విజయ లక్ష్మిని అభినందించారు. డిప్యూటీ మేయర్ చాంబర్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించిన మోతె శ్రీలత భాద్యతలు స్వీకరించే ఫైల్‌పై సంతకం చేశారు. కె.కేశవ రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేటి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, శాసన సభ్యులు దానం నాగేందర్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, పలువురు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్ శ్రీలత ను అభినందించారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి విందు.. చపాతీపై ఉమ్మివేసి తయారు చేశాడు.. అరెస్ట్