Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వనమా రాఘవ అరెస్ట్: ఆ సెల్ఫీ వీడియోనే కొంపముంచింది

Advertiesment
వనమా రాఘవ అరెస్ట్: ఆ సెల్ఫీ వీడియోనే కొంపముంచింది
, గురువారం, 6 జనవరి 2022 (20:40 IST)
Vanama
పాల్వంచలో రామకృష్ణ అనే వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌‌రావు కొడుకుపై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఈ వీడియో మీడియాలో ప్రసారమైంది. దీంతో రామకృష్ణ, అతడి కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన టీఆర్ఎస్​ లీడర్​ వనమా రాఘవ పాల్వంచలోని తన ఇంటి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. 
 
ఇప్పటికే రామకృష్ణ సూసైడ్​ నోట్​, సెల్​ఫోన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు నేపథ్యంలో తాజాగా వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయనను కొత్తగూడెం పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. 
 
వనమా రాఘవపై 302, 306, 307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాఘవ బెయిల్‌కు అప్లై చేసినా అడ్డుకునేందుకు రాకుండా కౌంటర్ దాఖలు చేస్తామంటున్నారు పాల్వంచ ఎఎస్పీ. మరోవైపు రాఘవ తండ్రి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కూడా తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కాసేపటి క్రితమే ఆయన బహిరంగ లేఖ రాశారు.
 
రాఘవపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి విచారణకు అయినా సహకరిస్తామని ఎమ్మెల్యే వనమా పేర్కొన్నారు. మరోవైపు ప్రతిపక్షాలు సైతం వనమాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యునైటెడ్‌ నేషన్స్‌ ప్రిన్సిపల్స్‌ ఆఫ్‌ రెస్పాన్సబల్‌ ఇన్వెస్టింగ్‌‌గా ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంతకం