Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెరాస మంత్రి బూతు పురాణం... నేను తలుచుకుంటే పేగులెల్తయ్‌!

తెలంగాణ రాష్ట్ర మంత్రి చందూలాల్ బూతు పురాణం వినిపించాడు. ములుగు జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు భిక్షపతిపై ఆయన తిట్లదండకం వినిపించారు. భిక్షపతి ఫోన్‌ చేసినప్పుడు.. చందూలాల్‌ విచక్షణ మరిచి అసభ్య పదజాలంతో

తెరాస మంత్రి బూతు పురాణం... నేను తలుచుకుంటే పేగులెల్తయ్‌!
, గురువారం, 29 జూన్ 2017 (09:06 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి చందూలాల్ బూతు పురాణం వినిపించాడు. ములుగు జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు భిక్షపతిపై ఆయన తిట్లదండకం వినిపించారు. భిక్షపతి ఫోన్‌ చేసినప్పుడు.. చందూలాల్‌ విచక్షణ మరిచి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. బలిసి ఉన్నరు.., పి...కుంట్ల గాడిద కొడుకువి..., లం..కొడుకువి.., గు..త మండ సంపిత్త.. అంటూ దుర్భాషలాడారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఇపుడు బయటకు రావడంతో మంత్రి తన ఫోన్ స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
తెలంగాణ రాష్ట్ర  పర్యాటక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా అజ్మీరా చందూలాల్‌ ఉన్నారు. ఈయన ములుగు జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతిని బెదిరించాడు. అంతేనా... సంయమనం కోల్పోయి రెచ్చిపోయారు. రాయలేని భాషలో నానా బూతులు తిడుతూ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘నేను తలుచుకుంటే నీ పేగులు బయటపడతాయ్‌’ హెచ్చరించారు. పైగా, ‘నీవు జిల్లా సాధించే మొగాడివా.. నీవెంత నీ బతుకెంత.. ఏం పీకుతావ్‌’ అంటూ ఒంటికాలిపై లేచారు. భిక్షపతి ఫోన్‌ చేసినప్పుడు.. చందూలాల్‌ విచక్షణ మరిచి అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. 
 
ఈ ఆడియో బయటకు రావడంతో చందూలాల్‌ అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాధ్యతాయుతమైన మంత్రి అయి ఉండి ప్రజల ఆకాంక్ష కోసం జరుగుతున్న ఉద్యమాలు, ఉద్యమకారులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ములుగు జిల్లా సాధన కోసం ఉద్యమం చేస్తున్నందునే భిక్షపతిపై మంత్రి కత్తిగట్టినట్లు అర్థమవుతోంది. చందూలాల్‌తో తనకు ప్రాణభయం ఉందని భిక్షపతి ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు. కాగా మంత్రి, భిక్షపతిల మధ్య జరిగిన ఫోన్ సంభాషణను ఓసారి పరిశీలిస్తే... 
 
మంత్రి చందూలాల్‌: హలో...
ముంజాల: నేను ముంజాల భిక్షపతిని సార్‌
మంత్రి: హా.. చెప్పయ్యా..
ముంజాల: బాగున్నారా సార్‌..
మంత్రి: బాగున్నా.. పెద్దలు కదా.. ఫోన్‌ చేశారు..
ముంజాల: సార్‌.. మీకన్నా పెద్దలం కాదు.. మీతోని మాట్లాడతానని మూడు నాలుగుసార్లు ఫోన్‌ చేసినా..
మంత్రి: బాగా బలిసి ఉన్నరు మీరు.. ములుగు వచ్చి చిల్లరగాళ్లు చిల్లర వ్యవహారం చేస్తున్నరు..
ముంజాల: లేదు సార్‌ మిమ్మల్ని కలుద్దామని..
మంత్రి: నేను తలుచుకుంటే పేగులెల్తయ్‌.. తొక్కితే... (బూతుపదం)
ముంజాల: మీతోని కలుత్తానని ఫోన్‌ చేస్తున్నా.. అమ్మతోడు మీ పీఏనడగండి..
మంత్రి: ఏం కలుత్తవయ్య నువ్వు.. పి... కుంట్ల గాడిది కొడుకువు.. నువ్వు నా మీద స్టేట్‌మెంట్‌ ఇత్తవ్‌.. జిల్లా సాధిస్తవ్‌ నువ్వు.. పి..కుంట్ల వ్యవహారం ఏందయ్య నీది.. నీ బతుకేందయ్యా.. నీది.. నువ్వు జానెడ్‌ లేవు.. నా పిల్లగాడు జూత్తే గు..తమండ సంపుతడు..
ముంజాల: నీతోని మాట్లాడతనని ఫోన్‌ చేసినా..
మంత్రి: ఏం మాట్లాడుతవ్‌ నువ్వు.. లౌ... మాట్లాడేది.. నీతోని నాకు అయ్యేదేంది. నాకు నీతోని జరిగేదేంది. నువ్వు నాకు వ్యతిరేకతై పీక్కునేదేంది.
ముంజాల: అట్లేం లేదు సార్‌.. ఒక్కసారి కలుస్త సార్‌.
మంత్రి: నువ్వు గు.. బలిచిన వ్యవహారం చేయద్దు బిడ్డా.. నకరాలు చేయద్దు.. ఎవల జాగల వాడు బతకాలే.. లేకుంటే మాత్రం గు..త మండ సంపిత్త.. నిన్ను ఆదుకునేటోడు ఎవ్వడు లేడు.. వాడు కుమార్‌గాడు సాయిత.. వాని సాయిత.. పి..కుంట్ల ల..కొడుకులు.. జిల్లా సాధిస్తవురా నువ్వు..
ముంజాల: గవాళ్లతోని ఏంది సార్‌.. గవాళ్లతోని అయితే మీకు ఫోన్‌ చేస్తనా..
మంత్రి: పి..కుంట్ల లం..కొడుకువు నువ్వు జిల్లా సాధిస్తవా.. నీ బతుకేందిరా.. నీ బతుకెంత.. ఊళ్లని దోపిడీ చేసి ములుగుకు వచ్చి రాజకీయాలు చేసి నకరాలు చేస్తున్నవా.. నీ బతుకు నాకు తెలువదా..
ముంజాల: నా గురించి నీకు తెలవదని నేనన్ననా సార్‌..
మంత్రి: జిల్లా సాధిస్తవారా నువ్వు నామీద కామెంట్‌ చేసేటోనివైనావా..
ము: మీరే జిల్లా సాధిస్తరు సార్‌..
మంత్రి: నీ బతుకెంతరా.. ఎన్ని కథలు చేసినవ్‌ నువ్వు..
ము: వాస్తవమేగాని సార్‌..
మంత్రి: నీ బతుకేంది.. నీ వ్యవహారమేంది..? బిడ్డా తలుచుకుంటే.. నువు ములుగులో కూడా ఉండలేవు.
ము: మీరు తలుచుకుంటే ములుగు జిల్లా అయితది.. మాదేమున్నది..
మంత్రి: నువ్వెవ్వడ్రా.. నన్ను అడిగేటందుకు జిల్లా కావాలని.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంజాన్‌కు ఇంటికొచ్చి.. స్నేహితుడిని రక్షించి... ప్రాణాలు కోల్పోయిన బీటెక్ యువకుడు