Publish Date: Sat, 30 Sep 2023 (09:04 IST)
Updated Date: Sat, 30 Sep 2023 (09:05 IST)
ఆదిలాబాదులో పిడుగుల వాన బీభత్సం సృష్టించింది. ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు రైతులు, ములుగు జిల్లాలో ఒక రైతు మరణించారు. పలు మూగ జీవాలు మృత్యువాత పడ్డాయి. అలాగే ఈ వర్షాల కారణంగా సంభవించిన పలు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం కురిసిన వాన భారీ విషాదాన్ని మిగిల్చాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలోని గూడ గ్రామానికి చెందిన 38 ఏళ్ల రైతు యాసిం తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తుంటారు.
పనులు ముగించి ఇంటికి తిరిగి వస్తుండగా ఆయన పిడుగుపడింది. దీంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అలాగే కుమురం భీం జిల్లాలోనూ 22 ఏళ్ల వివాహిత పిడుగుపాటుకు గురై మరణించారు.
సెల్వి
Publish Date: Sat, 30 Sep 2023 (09:04 IST)
Updated Date: Sat, 30 Sep 2023 (09:05 IST)