Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అక్కతో రెండు రోజుల్లో పెళ్ళి.. చెల్లితో శోభనం చేశాడు.. ఎక్కడ?

Advertiesment
older sister
, బుధవారం, 18 సెప్టెంబరు 2019 (16:55 IST)
ప్రియుడినే నమ్ముకుంది. అతనే సర్వస్వం అనుకుంది. పెళ్ళంటూ చేసుకుంటే అతడినే చేసుకోవాలని నిర్ణయించుకుంది. వందేళ్ళు అతనితో నడవాలని ఇంట్లో పెద్దలను ఎదిరించింది. అయితే చివరకు ప్రియుడి నిజస్వరూపం తెలుసుకుని నివ్వెరపోయింది.
 
హైదరాబాద్ లోని పంజాగుట్ట ప్రాంతమది. నాగేశ్వరరావు తన ఇద్దరు కూతుళ్ళు గీత, సంగీతలను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. చిన్నప్పుడే తల్లి అనారోగ్యంతో చనిపోయింది. గీత పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ కోర్స్ చేయాలనుకుంది. ఇక చెల్లెలు సంగీత ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకుని ఇక తనకు చదువు రాదని తండ్రికి చెప్పేసి ఇంటి పట్టునే ఉంటోంది. 
 
గీత సాఫ్ట్వేర్ కోర్సు చదువుకునేటప్పుడు అక్కడ ట్యూటర్ నరేష్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారి కొద్దిరోజులుకే ప్రేమ వరకు వెళ్ళింది. అతడిని గాఢంగా ప్రేమించింది. అతనే సర్వస్వం అనుకుంది. ఇంతలో తనకో సంబంధం చూశాడు గీత తండ్రి. అయితే తన ప్రేమ విషయాన్ని తండ్రికి చెప్పింది గీత. నరేష్ కుటుంబ సభ్యులను తీసుకుని ఇంటికి రమ్మని... వారితో మాట్లాడతామని నాగేశ్వరరావు చెప్పాడు. దీంతో సంతోషపడింది గీత.
 
నరేష్... మీ కుటుంబసభ్యులను మా ఇంటికి తీసుకురా అని ఫోన్ చేసింది. అయితే తాను అనాధనని, అనాథాశ్రమంలో ఉంటూ చదువుకున్నానని చెప్పాడు నరేష్‌. ప్రియుడు అలా చెప్పగానే అతనిపై ఇంకా ప్రేమ పెరిగిపోయింది. తండ్రికి ఈ విషయాన్ని చెప్పింది. తండ్రి పెళ్ళికి ఒప్పుకోలేదు. అనాధను పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని కూతురుకు నచ్చచెప్పాడు. తండ్రిని ఎదిరించలేక ఆమె తనలో తానే కుమిలిపోయింది. బోరున విలపించింది.
 
అయితే తన కుమార్తె తప్పు చేయదని నమ్మాడు తండ్రి. నరేష్‌ను ఇంటికి తీసుకురమ్మన్నాడు. నరేష్ ఇంటికి వచ్చాడు. అతని మాటతీరు బాగా నచ్చింది. ఇంకేముంది పెళ్ళి ఫిక్స్ చేసేశారు. ఇక పెళ్ళిపీటల మీదకు వెళ్ళడమే ఆలస్యం. ఇంతలో నరేష్‌ కళ్ళు తను కాబోయే భార్య చెల్లెలు సంగీతపై పడ్డాయి. షాపింగ్‌కు వెళ్ళేందుకు నాగేశ్వరరావు, గీత, నరేష్‌లు బయలుదేరారు. మధ్యలో తనకు పని ఉంది మీరు వెళ్ళి రండి అని పంపేశాడు నరేష్‌. 
 
వాళ్లనలా షాపింగ్‌కు పంపేసి నరేష్‌ నేరుగా ఇంటికి వచ్చాడు. ఇంట్లో సంగీత ఒంటరిగా వుంది. ఆమెను బెదిరించి పెళ్ళికి రెండురోజుల ముందు లొంగదీసుకున్నాడు. పెళ్లి దగ్గరపడుతున్నకొద్దీ సంగీత మౌనముద్రలో పడిపోవడం అక్క గీత గమనించింది. చెల్లెలిని గట్టిగా నిలదీసింది.

అయితే మౌనంగా ఉండిపోయింది సంగీత. ఇంతలో గీతకు ఫోన్.. నువ్వు పెళ్ళి చేసుకోబోయే నరేష్.. మామూలోడు కాదు. ఇప్పటికే ఐదుగురు యువతుల జీవితాలతో ఆడుకున్నాడు. నేను అతనిపై కేసు కూడా పెట్టానని శ్వేత అనే యువతి ఫోన్ చేసింది.
 
దీంతో గీతకు గుండెలు బద్దలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత చెల్లెలిని గట్టిగా అరుస్తూ అడిగింది. దీంతో అసలు విషయం చెప్పేసింది. జరిగిందంతా తండ్రికి వివరించింది. తాము మోసపోయామని తెలుసుకున్నారు. గీత ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకుంది. సంగీత మొబైల్ నుంచి నరేష్‌కు ఒక మెసేజ్ పెట్టింది. 
 
నేను నిన్ను ఎలాగైనా కలవాలనుకుంటున్నానని చెప్పింది. ఉప్పల్ లోని మారుమూల ప్రాంతానికి రమ్మని చెప్పింది. అక్కాచెల్లెళ్ళు అక్కడకు వచ్చారు. నరేష్‌ అక్కడకు రాగానే... ముందస్తు పథకం ప్రకారం అక్కాచెల్లెళ్లిద్దరూ అతడిని రాళ్ళతో కొట్టి అతి దారుణంగా చంపేశారు. నిందితులను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'కమలం' చెంతకు చిన్నమ్మ నమ్మినబంటు... జైలు నుంచి శశికళకు విముక్తి?