Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రకాశం పంతులు.. పొట్టి శ్రీరాములు చిత్రపటాలు పీకేయండి : కేసీఆర్

Advertiesment
Telangana state assembly committee hall
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (11:42 IST)
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్ గోడలపై ఉన్న సీమాంధ్ర నేతలైన టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు చిత్రపటాలను తక్షణం పీకిపారేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగమేఘాలపై ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరికి తెలంగాణ రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదని... అందువల్ల వారి పటాలు శాసససభలో ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. 
 
ముఖ్యమంత్రి తాజా ఆదేశాలతో ఆ మహానుభావుల పోటోలను గోడలపై నుంచి తీసివేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే, తొలగించిన చిత్రపటాలను చెత్తతొట్టెలో పారేయబోమని, ఈ పటాలను తమ దగ్గరే జాగ్రత్తగా భద్రపరుస్తామని... ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగితే వాటిని అప్పగిస్తామని అధికారులు చెపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu