Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మందు పార్టీలో 'కోవిడ్' అధికారులు.. భౌతికదూరం గాలికొదిలేసి...

మందు పార్టీలో 'కోవిడ్' అధికారులు.. భౌతికదూరం గాలికొదిలేసి...
, మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (09:36 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ బారినుంచి తప్పించుకునేందుకు దేశాలన్నీ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా, ఈ వైరస్‌ విరుగుడుకు ఎలాంటి మందు లేకపోవడంతో వైరస్ బారినపడుకుండా ఉండేందుకు కేవలం సామాజిక భౌతిక దూరమే ఏకైక మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆయా ప్రభుత్వాలు కూడా కోవిడ్‌తో పాటు భౌతికదూరంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రత్యేకంగా కోవిడ్ బృందాలను ఏర్పాటు చేశాయి. 
 
ఈ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ వివిధ రకాలుగా ప్రచారం చేస్తూ, ప్రజల్లో అవగాహన కల్పించడమే. అయితే, ఓ కోవిడ్ బృందంలోని కొందరు అధికారులు భౌతికదూరాన్ని గాలికొదిలేసి.. ఎంచక్కా మందుపార్టీ చేసుకున్నారు. ఈ విషయం మీడియాకు తెలిసి, అక్కడకు వెళ్లడంతో మందు, ముక్కలను అక్కడే వదిలివేసి పారిపోయారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లా మధిరలో మండలస్థాయి అధికారులు 8 మంది కోవిడ్-19 విధుల్లో ఉంటూ వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. వైరస్ సోకకుండా ఉండాలంటే భౌతికదూరం పాటించాలంటూ హోరెత్తిస్తున్నారు.
 
అయితే, విచిత్రంగా సోమవారం వీరంతా భౌతికదూరం నిబంధనను గాలికొదిలేసి మండల అధికారి విశ్రాంతి భవనంలో మందు పార్టీ చేసుకున్నారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడికి వెళ్లగానే తలో దిక్కుకు పరిగెత్తారు. 
 
ఓ అధికారి బాత్రూములో దూరి గడియపెట్టుకోగా, మిగిలినవారు గోడదూకి పరారయ్యారు. బాత్రూములో నక్కిన అధికారి కూడా అరగంట తర్వాత బయటకొచ్చి పరుగందుకున్నాడు. 
 
మద్యం, మాంసం, ఇతర ఆహార పదార్థాలు అక్కడే వదిలేసి పరుగులు తీశారు. అంతేకాదు, అక్కడి వంట గదిలో ఖరీదైన మద్యం సీసాలు మరిన్ని కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు గెస్ట్ హౌస్‌కు చేరుకుని పరిశీలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో తొలి కరోనా మరణం.. తడలో ఒకే ఫ్యామిలీలో 4 పాజిటివ్ కేసులు