Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మట్టి పొలాలపై పడిన తెలంగాణ ప్రభుత్వం: చుక్కలు చూస్తున్న భూముల ధరలు

మట్టి పొలాలపై పడిన తెలంగాణ ప్రభుత్వం: చుక్కలు చూస్తున్న భూముల ధరలు
, మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (13:05 IST)
ప్రభుత్వానికి ఆదాయం కావాలంటే మద్యం ఏరులై పారుతుందని అంటుంటారు. ఆ సంగతి ప్రక్కన పెడితే ఇప్పుడు ప్రభుత్వాలు మద్యం కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని పిండుకునే పని ప్రారంభిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూముల ధరలను భారీగా పెంచేసింది.

 
రాష్ట్రంలోని అన్ని రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు కేవలం ఆరు నెలల్లోనే ప్రభుత్వం మార్కెట్ విలువలను పెంచింది. ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ వ్యవసాయం, వ్యవసాయేతర, వాణిజ్యం వంటి అన్ని రకాల ఆస్తులపై మార్కెట్ విలువలను 15 శాతం నుంచి 60 శాతం వరకూ పెంచింది. కొత్త రేట్లు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
 
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-2022లో రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ రూ.12,000 కోట్ల ఆదాయాన్ని పొందుతుందని, మార్కెట్ విలువల పెంపుదల తర్వాత మరో రూ.3,000 కోట్ల నుంచి రూ.4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

 
రిజిస్ట్రేషన్ కోసం భూమి విలువలను వ్యవసాయ ఆస్తులకు 50%, కొన్ని గ్రామాల్లో ప్రస్తుత ధరలపై 60%కి పెంచనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ ప్రభుత్వం నిర్ణయించిన కనీస భూమి ధరల ఆధారంగా 7.5% స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రెండింటినీ సేకరిస్తుంది. గతేడాది ఆగస్టులో ప్రభుత్వం ఆస్తుల విలువను పెంచింది.

 
పెంచిన భూముల ధరల ప్రకారం వ్యవసాయ ఆస్తులకు ఎకరానికి రూ. 75,000 రిజిస్ట్రేషన్ల కోసం ప్రస్తుతం ఉన్న కనీస రేటు ఎకరాకు రూ. 1.50 లక్షలకు పెంచడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న విలువలపై 35%, ఫ్లాట్లపై 15% నుండి 25% వరకు రేట్లు పెంచే అవకాశం వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేతన జీవులకు నిరాశ : ఆదాయపన్ను జోలికి వెళ్లని కేంద్రం