తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో లుకలుకలు బయటకు వస్తున్నాయి. సీట్ల కేటాయింపుల్లో తీవ్రమైన అసంతృప్తి కనబడుతోంది. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లాలో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.
అన్నీ స్థానాల్లో విజయ అవకాశాలు ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. చేవెళ్లలో 30 ఏళ్లుగా పార్టీ సేవలు చేసిన వారికి సీటు రాకపోవడం అయోమయానికి గురిచేస్తుందన్నారు.
మరోసారి సీట్ల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
క్యామ మల్లేష్, మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరిని కూర్చోబెట్టి ఇద్దరిలో ఒకరికి సీటు ఇస్తే పార్టీకి లాభం ఉంటుందని అన్నారు. హైకమాండ్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనీ, లేదంటే పార్టీకి నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని అన్నారు. చూడండి ఆమె మాటల్లోనే....