రహేజా ఐటీపార్క్ మైండ్‌స్పేస్‌లో ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా వైరస్ లక్షణాలు నిజమే.. కానీ, ఇంకా నిర్ధారణ కాలేదని సైబరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు.
కరోనా లక్షణాలున్న ఉద్యోగినితో సన్నిహితంగా ఉన్నవారికీ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. కరోనాపై తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
కరోనాపై తప్పుడు వార్తలతో పుకార్లు రేపుతున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైందని చెప్పారు.
మైండ్‌స్పేస్ బిల్డింగ్‌లో కేవలం ఒక్క ఫ్లోర్ మాత్రమే ఖాళీ చేయించామన్నారు. మిగతా ఆఫీసులన్నీ యథావిధిగా పనిచేస్తాయని చెప్పారు.