Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణ మధ్య రైల్వే ఉద్యావన శాఖకు అవార్డుల పంట..

scr awards
, సోమవారం, 17 ఏప్రియల్ 2023 (11:41 IST)
దక్షిణ మధ్య రైల్వే ఉద్యానవన శాఖకు అవార్డుల పంట పడింది. వివిధ కేటగిరీల్లో ఏకంగా 11 అవార్డులను కైవసం చేసుకుంది. ఈ అవార్డులను ఏడీజీ సింగయ్య అందుకున్నారు. గోల్డ్ గార్డెన్ సర్టిఫికేట్‌ను కూడా ఆయన స్వీకరించారు. ఈ అవార్డులను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రధానం చేశారు. దక్షిణ మధ్య రైల్వే ఉద్యానవనాల విభాగం ఒకేసారి ఇన్ని అవార్డులు అందుకోవడంతో ఏడీజీ సింగయ్య పట్టరాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
 
రాష్ట్ర ఉద్యావనశాఖ ప్రతి యేటా గోల్డ్ గార్డెన్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంటుంది. ల్యాండ్ స్కేప్ గార్డెన్‌లు, వ్యవసాయ గృహాలు, పోడియం గార్డెన్‌లు ట్రాఫిక్ ఐల్యాండ్‌లు లాన్లు తదితర 12 విభిన్న విభాగాల్లో ఈ యేడాది దరఖాస్తులను ఆహ్వానించారు. జనవరి 10 నుంచి 20 వరకు గార్డెన్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో దక్షిణ మధ్య రైల్వేకు ఏకంగా 11 అవార్డులతో తొలిస్థానం దక్కించుకుంది. 
 
ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ స్పందిస్తూ, రైల్వే కార్యాలయాలు, నివాసాల మధ్య పర్యావరణం, పరిసరాల్లో పచ్చదనాన్ని పెపొందించడం వల్ల కాలుష్యాన్ని తగ్గించగలుగుతామని ఇదే సమయంలో స్వచ్ఛమైన గాలి కూడా పెరుగుతుందని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ వ్యాప్తంగా మండిపోతున్న ఎండలు.. నిర్మల్‌ జిల్లాలో అత్యధిక టెంపరేచర్