వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా బుధవారం రాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాం కురిసింది. ముఖ్యంగా, ఖైరతాబాద్‌లో అత్యధికంగా 1.0 సెంటీమీటర్లు, హిమయత్ నగర్‌లో 1.2 సెంటీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 1.0 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
అలాగే, వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.