Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలోని ప్రజారోగ్య కేంద్రాలకు విరాళం అందించిన నెక్స్‌ట్రాకర్

Advertiesment
image
, మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (23:29 IST)
ఇంటెలిజెంట్ సోలార్ ట్రాకర్ మరియు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ అందించే ప్రముఖ సంస్థ Nextracker, వెనుకబడిన కమ్యూనిటీలకు సాధికారత కల్పించడానికి అంకితమైన ఒక NGO సమర్థనమ్ ట్రస్ట్ ఫర్ ది డిసేబుల్డ్ తో భాగస్వామ్యం చేసుకుని సంగారెడ్డి జిల్లాలో ఉన్న కొండాపూర్ మరియు ఆత్మకూర్‌లోని రెండు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో (PHC) అత్యాధునిక సోలార్ ఫోటోవోల్టాయిక్ (PV)ని ఇన్‌స్టాల్ చేసింది. ఈ PV వ్యవస్థలు 15 మాడ్యూళ్లను కలిగి ఉంటాయి, వార్షిక సామర్థ్యం 6 kW. ఈ భాగస్వామ్యం ద్వారా, ఈ ప్రాంతంలో నివసిస్తున్న 50,000 మందికి అధిక-నాణ్యత ఆరోగ్య సంరక్షణ సేవలను అందించి, వారి జీవితాలను మెరుగుపరచాలని రెండు సంస్థలు ఆకాంక్షిస్తున్నాయి.
 
Nextracker వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ శ్రీ రాజీవ్ కశ్యప్ ఈ కార్యక్రమం పట్ల మాట్లాడుతూ, "Nextracker వద్ద, మా లక్ష్యం, కమ్యూనిటీల అత్యంత క్లిష్టమైన అవసరాలను తీర్చే ప్రపంచాన్ని సృష్టించడం. సమర్థనంతో మా భాగస్వామ్యం ద్వారా, ఆశను రేకెత్తించే సౌర ఆవిష్కరణలు మరియు జీవితాలను మార్చే భవిష్యత్తుకు మేము కట్టుబడి ఉన్నాము. నమ్మకమైన సౌర శక్తి పరిష్కారాలతో, ఈ కేంద్రాలు సజావుగా పనిచేస్తాయి, అవి అంతరాయం లేని చికిత్సలు మరియు సేవలను అందిస్తాయి" అని అన్నారు. 
 
సమర్థనం ట్రస్ట్ ఫర్ ది డిజేబుల్డ్ వ్యవస్థాపక ట్రస్టీ డాక్టర్ మహంతేష్ జి. కివాడసన్నవర్ మాట్లాడుతూ, 'Nextrackerతో మా భాగస్వామ్యం అట్టడుగు వర్గాలకు ఆరోగ్య సంరక్షణ యాక్సెసిబిలిటీని పెంపొందించడంలో మా నిబద్ధతను వివరిస్తుంది. స్థిరమైన ఇంధన పరిష్కారాల ద్వారా, మేము కొత్త ఆశను నింపుతున్నాము. వేలాది మంది జీవితాలకు సమగ్ర సంరక్షణను అందిస్తున్నాము.' అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అధికంగా ప్రయాణాలు చేసే పురుషుల కోసం బ్లాక్‌బెర్రీస్ ఆల్-వెదర్ టెక్నాలజీ, టెంప్ టెక్‌ విడుదల