Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్ లో కరోనా కట్టడికి మొబైల్ కంటైనర్ వైరాలజీ ల్యాబ్.. దేశంలోనే ప్రప్రథమం

Advertiesment
Mobile Container
, గురువారం, 23 ఏప్రియల్ 2020 (15:39 IST)
దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా కేసులను అరికట్టడానికి వైద్య శాస్త్రవేత్తల బృందం భారత్ లో మొట్టమొదటిసారి బహుళ ప్రయోజనకరమైన బీఎస్ఎల్ 3 అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మొబైల్ కంటైనర్ వైరాలజీ ల్యాబ్ ను సిద్ధం చేసింది. 

నిమ్స్ హాస్పిటల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం అధిపతి ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మధు మోహన్ రావు మొబైల్ ల్యాబ్ ను  రూపకల్పన చేశారు.. ఈఎస్ఐ వైద్య కళాశాల డీన్ డాక్టర్ శ్రీనివాస్ సంపూర్ణ సహకారం అందించారు.

దీనిని త్వరలోనే ఈ ఎస్ ఐ వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్నారు.. శాస్త్రవేత్తల బృందం డాక్టర్ వై శ్రీనివాస్, ఎమ్మెస్సార్ ప్రసాద్, బి హెచ్ పి ఎస్ నారాయణ మూర్తి మొబైల్ కంటైనర్ ల్యాబ్ నిర్మాణానికి కావలసిన సాంకేతికతను  అందించారు.

ఈ సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించి 'ఐ కామ్' అనే  సంస్థ రెండు కంటైనర్ ఉచితంగా తయారు చేసి ఇచ్చింది. 'ఐ
క్లీన్' అనే  సంస్థ ఈ రెండు కంటైనర్ల తో బీఎస్ ఎల్3. (బయో సేఫ్టీ 3)   ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలను కేవలం 15 రోజులలో సిద్ధం చేసింది.

సాధారణంగా అంతర్జాతీయ ప్రమాణాలలో బీఎస్ ఎల్3 వైరాలజీ ప్రయోగశాలను సిద్ధం చేయడానికి కనీసం ఆరు నెలల నుంచి ఏడు నెలలు పడుతుంది.. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా ఈ సంస్థ యుద్ధప్రాతిపదికన కేవలం పదిహేను రోజుల్లోనే మొబైల్ ల్యాబ్ ను సిద్ధం చేసింది.

సాధారణ వైరస్ ప్రయోగాల కోసం బీఎస్ ఎల్3 ప్రయోగశాల ఉంటే సరిపోతుంది. అయితే కోవిడ్ 19 వంటి ప్రాణాంతక వైరస్ పై ప్రయోగాలు చేయాలంటే బీఎస్ ఎల్3 ప్రమాణాలతో కూడిన ప్రయోగశాల తప్పనిసరి.. బీఎస్ ఎల్3 ప్రమాణాలు పాటించడం వల్ల ఇందులో పనిచేసే శాస్త్రవేత్తలు సిబ్బంది వైరస్ బారిన పడకుండా సురక్షితంగా ఉంటారు..
 
నిమ్స్ వైద్యశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మధు మోహన్ రావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు వైద్యులు ఈ ప్రయోగశాల లో విధులు నిర్వహిస్తారు.. ల్యాబ్ లో కోవిడ్ 19 వైరస్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.

అదేవిధంగా నియంత్రిత వాతావరణంలో వైరస్ ను పెంచుతారు .. వైరస్ ను అరికట్టగల  మందులను కనుగొనడానికి ప్రయోగాలు చేస్తారు.. వైరస్ క్రమాన్ని అధ్యయనం చేసి వ్యాక్సిన్ను కనిపెట్టడానికి పరిశోధనలు చేస్తారు..
 
 దేశంలోనే ప్రప్రథమం
అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే ఇటువంటి ప్రయోగశాలలు ఉన్నాయి.. భారతదేశంలో బీఎస్ ఎల్3 ప్రమాణాలతో మొబైల్ కంటైనర్ నిర్మించడం ఇదే మొదటిసారి. వైద్యులు ఇంజనీర్లు శాస్త్రవేత్తల సహకారంతో మొబైల్ వైరాలజీ ల్యాబ్ సాధ్యమైంది.. 
 
మొబైల్ వైరాలజీ ల్యాబ్ లో కరోనా కాకుండా అనేక ఇతర వ్యాధి నిర్ధారణ పరీక్షలు పరిశోధనల కోసం ఉపయోగించుకోవచ్చు.

అత్యవసరమైన పరిస్థితులను అవసరమైన ప్రదేశాలకు ఈ ప్రదేశాలను ఎక్కించి తరలించవచ్చు. అదేవిధంగా సైనిక అవసరాల కోసం కూడా దీనిని ఉపయోగించవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా వాహనం లోనే మధ్యప్రదేశ్ పంపిస్తా: వలస కూలీలకు హరీష్ రావు హామీ