మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఊహించిందేనని ఆపార్టీ లోక్‌సభ అభ్యర్థి, ఎంపీగా విజయం సాధించిన కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మాట్లాడుతూ ఓటింగ్ శాతం తగ్గినా టీఆర్ఎస్కు మంచి మెజార్టీ వచ్చిందన్నారు.
ప్రజలు టీఆర్ఎస్ను విశ్వసించారని కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్ఎస్ కట్టుబడి ఉందని అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన నియోజకవర్గ ప్రజలకు కొత్త ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, మెదక్ లోక్‌సభ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈయన మొత్తం 3,64,229 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే, గత ఎన్నికల్లో కేసీఆర్ సాధించిన మెజార్టీ కంటే 30 వేలు తక్కువ కావడం గమనార్హం.