Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలిసీ తెలియని ప్రేమ.. ప్రాణాల మీదకు తెచ్చింది...

హాయిగా చదువుకోవాల్సిన వయసులో ఆకర్షణకు లోనై.. ముక్కుపచ్చలారని వయసులో క్షణికావేశానికి లోనై ఇరువురు ప్రేమికులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. హైదరాబాద్ రెహ్మత్ నగర్‌కు చెందిన శరత్ ‌(19) బంజారహిల్స్‌కు చెందిన యువతి(18) ఎస్.ఆర్ నగర్‌లో వేర్వేరు కళాశాలల్లో

Advertiesment
తెలిసీ తెలియని ప్రేమ.. ప్రాణాల మీదకు తెచ్చింది...
, శనివారం, 29 సెప్టెంబరు 2018 (15:49 IST)
హాయిగా చదువుకోవాల్సిన వయసులో ఆకర్షణకు లోనై.. ముక్కుపచ్చలారని వయసులో క్షణికావేశానికి లోనై ఇరువురు ప్రేమికులు ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. హైదరాబాద్ రెహ్మత్ నగర్‌కు చెందిన శరత్ ‌(19) బంజారహిల్స్‌కు చెందిన యువతి(18) ఎస్.ఆర్ నగర్‌లో వేర్వేరు కళాశాలల్లో ఇంటర్ చదవుతున్నారు.
 
10 వతరగతి నుంచే మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో ఇరువురిని మందలించారు. దీంతో గోల్కొండ కోటకు చేరుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఈ యువ ప్రేమికులు. ఆత్మహత్య విషయం శరత్ స్నేహితుడు మనీష్‌కు ఫోన్లో తెలియజేయడంతో మనీష్ గోల్కొండ కోటకు చేరుకుని ఇరువురినీ వారించాడు.
 
అయినా వినకుండా ప్రేమికులిద్దరూ పరుగెత్తుకుంటూ వెళ్లి దూకేశారు. స్థానికులు గమనించి గోల్కొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు  అక్కడికి వెళ్లేసరికి ఇద్దరూ అపస్మారక స్థితిలో కనిపించారు. తక్కువ ఎత్తులో నుంచి కిందకు దూకడం మూలంగా ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండోనేషియాలో సునామీ, భూకంపం.. 384 మంది మృతి