తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణలోని కరీంనగర్, మెదక్, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు నీటమునిగాయి. దీంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరాయి.
ఈ నేపథ్యంలోనే సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలని కూడా మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.