Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 6 April 2025
webdunia

మాయ కాదు.. అరుంధతి నక్షత్రాని నిజంగా చూపించిన పెళ్లికొడుకు

Advertiesment
groom
, సోమవారం, 27 జులై 2020 (15:23 IST)
తాళికట్టు తంతు ముగిసిన తరువాత పంతులు గారు నవదంపతులను ఆరుబయటకు తీసుకువచ్చి వరుడు చేత వధువుకు అరుంధతి నక్షత్రం చూపించడం ప్రతి వివాహం లోనూ అతి సహజంగా జరుగుతుంది. నిజానికి అక్కడ  అరుంధతి నక్షత్రం ఉండదు.. ఒక వేళ ఉన్నా మన కంటికి కనిపించదు.
 
అయినా చూసినట్లుగా వధువు తల ఊపుతుంటుంది. వధూవరులు ఇద్దరూ ఫోటోకు ఫోజు కూడా ఇస్తారు. అంతేనా అరుంధతి నక్షత్రం చూస్తున్న ఫొటో, పెళ్లి ఆల్బమ్‌లో కచ్చితంగా ఉంటుంది. అయితే జగిత్యాలలో పెళ్లి కొడుకు అభయ్ రాజ్ తన భార్యకు అబద్దపు నక్షతం గాకుండా నిజంగా చూపించాలని వినూత్న ప్రయత్నం చేసి విజయం సాధించాడు.
 
రాయికల్ మండలం రామారావు పల్లెలోని పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పనిచేస్తున్న అభయ్ రాజు టెలీస్కోప్‌ను ఉపయోగించి తన భార్యకు నిజమైన అరుంధతి నక్షత్రాన్న చూపించాడు. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా ఔరా పెళ్లి కొడకా అంటూ ముచ్చటపడ్డారు. దీనిపై వధువు మాట్లాడుతూ నిజంగా అరుంధతి నక్షత్రం చూడటంతో చాలా సంతోషం వ్యక్త చేసింది. జీవితంలో ఇంక ఎన్ని వండర్స్ చూపిస్తాడో నా భర్త అంటూ ఆశ్చర్య పోయింది. పెళ్లి కొడుకు అభయ్ రాజ్ భౌతిక శాస్త్రంలో జాతీయ స్థాయిలో 75వ ర్యాంకు పొందాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శోభనానికి ఏర్పాట్లు చేస్తే.. నాలుగు రోజులు తప్పించుకున్నాడు.. ఎన్నారై ముంచేశాడు..