Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GHMCResults, దూసుకెళ్తున్న BJP, వెనకబడుతున్న TRS

Advertiesment
GHMCResults, దూసుకెళ్తున్న BJP, వెనకబడుతున్న TRS
, శుక్రవారం, 4 డిశెంబరు 2020 (09:06 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అనూహ్యంగా భాజపా దూసుకువెళుతోంది. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థులు 23 చోట్ల ఆధిక్యంలో వున్నారు. అధికార తెరాస 6 చోట్ల మాత్రమే ఆధిక్యంలో వున్నారు. మొత్తం 1122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
 
ఈ ఎన్నికల పోలింగ్ ఈ నెల ఒకటో తేదీన బ్యాలెట్ విధానంలో జరిగిన విషయం తెల్సిందే. ఈ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభంకానుంది. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు వివిధ ప్రాంతాల్లో జరుగుతోంది. 
 
అయితే, ఈసారి బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరుగడంతో ఫలితాల వెల్లడి కొంత ఆలస్యమయ్యే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించి వార్డుకు ఒక కౌంటింగ్‌ హాల్‌ చొప్పున ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌పై ఓట్లను మదించనున్నారు. ఒక్కో టేబుల్‌పై గంటకు వెయ్యి చొప్పున 14 వేల ఓట్లు లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ లెక్కన 28 వేల లోపు ఓట్లు పోలైన డివిజన్‌ల్లో కౌంటింగ్‌ మొదలుపెట్టిన రెండు గంటల్లోనే జయాపజయాలు ఖరారు కానున్నాయి. 
 
తక్కువ ఓట్లు పడిన మెహిదీపట్నం (11,818) నుంచి తొలిఫలితం రావచ్చని భావిస్తున్నారు. ఎక్కువ ఓట్లు పడిన మైలార్‌దేవ్‌పల్లి (37,445) డివిజన్‌ ఫలితం అన్నింటికంటే చివరన వచ్చే అవకాశముంది. బ్యాలెట్‌ పేపర్లు బయటికి తీసి, కట్టలు కట్టే ప్రక్రియను పూర్తి చేసుకున్నాక మధ్యాహ్నంలోపు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి సాయంత్రానికే అన్ని డివిజన్ల ఫలితాలు వెల్లడవుతాయని భావిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వృద్ధుడినన్న కనికరం కూడా చూపలేదు.. పలుమార్లు లాఠీతో కొట్టారు.. ఇవిగో గాయాలు