Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెల 6 నుంచి 17 వరకు దసరా సెలవులు

Advertiesment
ఈ నెల 6 నుంచి 17 వరకు దసరా సెలవులు
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (10:33 IST)
తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో ముఖ్యమైన పండుగల్లో ఒకటైన బతుకమ్మ, అలాగే, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులను ఆ రాష్ట్ర విద్యా శాఖ ప్రకటించింది. 
 
ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
 
అలాగే, ఇంటర్‌ కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి సెలవులివ్వనున్నారు. 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

7 గంటల పాటు స్తంభించిన ఆ మూడు మాధ్యమాలు...?!