Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో కరోనావైరస్ పరిస్థితి ఎలా వుంది?

Advertiesment
తెలంగాణలో కరోనావైరస్ పరిస్థితి ఎలా వుంది?
, సోమవారం, 29 జూన్ 2020 (23:26 IST)
భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్ అగర్వాల్ నేతృత్వంలోని కేంద్ర బృందం గచ్చిబౌలీ లోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS), గాంధీ ఆసుపత్రి, దోమల్ గూడాలోని దోభీ గల్లీ (కంటేన్‌మెంట్ ఏరియాను) సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిస్థితులను పరీశిలించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, సీనియర్ ఆధికారులతో సమావేశమై కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాలసిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.
 
రాష్ట్రంలో కోవిడ్ మేనేజ్‌మెంట్ పైన వైద్య శాఖ అధికారులు డిటేల్డ్ ప్రజెంటేషన్ ను ఇచ్చారు. రాష్ట్రంలో సర్వైలెన్స్ , కంటేన్ మెంట్ చర్యలు , ఆసుపత్రుల సన్నద్దత, వైద్య సంరక్షణ పరికరాల సమీకరణ, వైరెస్ నివారణ చర్యలపై కేంద్ర బృందానికి వివరించారు. రాష్ట్రంలో 17081 బెడ్లు ఉన్నాయని, మరింత మెరుగైన చికిత్స కోసం 4489 అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసామని తెలిపారు. వైద్య మౌలిక సదుపాయలు మెరుగుపరచడం కోసం రూ.475.74 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
 
కేంద్ర బృందం రాష్ట్రంలోని ఆసుపత్రుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసింది మరియు ఇతర రాష్ట్రాల క్షేత్ర స్థాయి పర్యటనల అనుభవాన్ని పంచుకుంది. కేంద్ర బృందం రాష్ట్రంలో కరోనా నియత్రణ చర్యలు, వైద్య పరీక్షల సామర్ధ్యం పెంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ మరియు క్లినికల్ మెనేజ్మెంట్ పైన సూచనలు చేసింది. కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వచ్చే రెండు నెలలో చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల శ్రీవారి దర్శనం, ఇలా ఆన్లైన్లో రిలీజ్, అలా భక్తులు బుక్