Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి.. ఇంట్లో వుండగానే ఇలా జరిగింది..

vhanumantha rao
, గురువారం, 14 ఏప్రియల్ 2022 (16:21 IST)
కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. పాల్పడ్డారు. హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆయన ఇంటిపై రాళ్లు రువ్విన దుండగలు... ఇంటి ముందు పార్క్ చేసిన కారు అద్దాలు ధ్వంసం చేశారు. 
 
ఈ దాడి సమయంలో వీహెచ్ ఇంట్లోనే ఉన్నారు. దాడి ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
 
దాడిపై వీహెచ్ మాట్లాడుతూ... మాజీ పీసీసీ అధ్యక్షుడిని, మాజీ మంత్రిని అయిన తనకు రక్షణ లేదా అని ప్రశ్నించారు. ఇవాళ ఇది జరిగింది... రేపు ఇంకొకటి జరగవచ్చునని అన్నారు. గతంలో బెదిరింపు కాల్స్ వచ్చినప్పుడు డీజీపీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు.
 
కనీసం భద్రత కూడా కల్పించలేదని మండిపడ్డారు. తనకు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నిలదీశారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి తానెప్పుడూ ముందుంటానని... అలాంటి తనపై ఈ దాడికి పాల్పడిందెవరో బయటపెట్టాలని పోలీసులను డిమాండ్ చేశారు.
 
వీహెచ్ ఇంటిపై దాడి ఘటనను రేవంత్ రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ నాయకులపై దాడులను సహించేది లేదని.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ ప్రజల మనిషి అని... ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటారని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీవ్రస్థాయిలో దెబ్బతిన్న రష్యా నౌక