Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కల్లు రుచి చూసిన భట్టి..

కల్లు రుచి చూసిన భట్టి..
, శుక్రవారం, 12 మార్చి 2021 (10:19 IST)
ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆయన భద్రాచలం నుంచి ఖమ్మం వరకు చేపట్టిన సైకిల్‌ యాత్ర నాలుగోరోజైన బుధవారం ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, చింతకాని మండలాల మీదుగా సాగి రాత్రికి ముదిగొండ మండలం వల్లాపురానికి చేరుకుంది.

సైకిల్‌యాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొణిజర్ల మండలం గోపవరం నుంచి పెద్దమునగాల, రెడ్డిగూడెం వెళుతుండగా మార్గంమధ్యలో ఓ గీతకార్మికుడిని అప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత ఆ గీతకార్మికుడి వద్ద ఉన్న కల్లును రుచి చూసి అతడు చెప్పిన సమస్యలను విన్నారు.

గీతకార్మికుల సమస్యలపై కూడా కాంగ్రెస్‌ పోరాడుతుందని భరోసా ఇచ్చారు. చింతకాని మండలం ప్రొద్దుటూరులో గిరిజన మహిళలు వండి పెట్టిన జొన్న రొట్టెలను భట్టి ఆరగించారు.  పెట్రో, గ్యాస్‌, నిత్యావసరాల ధరలను పెంచుతూ అన్నివర్గాల ప్రజల నడ్డివిరుస్తున్న మోదీ, కేసీఆర్‌లను చీపురుకట్టలు తిరగేసి తరిమికొట్టాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. 
 
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసమే సీఎం కేసీఆర్‌ 29శాతం ఫిట్మెంట్‌ డ్రామాకు తెరలేపారని సీఎల్పీ నేత, ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఉద్యోగసంఘాల నేతలు కేసీఆర్‌కు భజనపరులుగా మారి ఉద్యోగుల జీవితాలను పణంగా పెడుతున్నారని దుయ్యబట్టారు.

బుద్ధిలేని సీఎం కేసీఆర్‌ పీఆర్సీ గురించి ఏడుసంవత్సరాలుగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ధరలపెంపుపై ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆవేదనను శాసనసభలో తన గళం ద్వారా వినిపిస్తానన్నారు. రాష్ట్రంలో పెట్రోల్‌, డిజిల్‌పై రూ.23 పన్ను వేసి కేసీఆర్‌ ప్రభుత్వం జలగలా ప్రజల రక్తాన్ని పీలుస్తోందని మండిపడ్డారు. 

కార్పొరేట్‌ విద్యాసంస్థలతో విద్యార్థులను దోచుకుంటున్న పల్లా రాజేశ్వరరెడ్డిని ఓడించి ఆయనకు, ఆయనకు అండగా ఉన్న వైద్య, వ్యాపారవేత్త మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాములునాయక్‌కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి.. ప్రశ్నించే గొంతుకను మండలికి పంపాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే 2023-24లో అఖండ మెజారిటీ సాధించి కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని, ప్రస్తుత ఈ ప్రభుత్వాల బెదిరింపులకు ఎవరూ భయపడొద్దన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెట్ లో ఆ మాజీ మంత్రి బిజీ.. ఎవరో తెలుసా?