Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

భర్త హైదరాబాదులో, ప్రియుడితో భార్య ఎంజాయ్, అత్త చూసేయడంతో?

Advertiesment
affair
, బుధవారం, 29 జనవరి 2020 (15:04 IST)
అక్రమ సంబంధం మరో ప్రాణాన్ని బలిగొంది. భర్త పనుల కోసం దూర ప్రాంతాలకు వెళుతూ ఉంటే విరహాన్ని తట్టుకోలేని భార్య ఏకంగా ఒక టివి మెకానిక్‌తో కమిటైంది. విషయం కాస్తా అత్తకు తెలిసి హెచ్చరించడంతో ఆమెను దారుణంగా ఇద్దరూ కలిసి చంపేశారు. 
 
ఖమ్మం జిల్లా గాంధీనగర్ అది. రంజిత్, భానులకు సంవత్సరం క్రితం వివాహమైంది. రంజిత్ తన తల్లి చంద్రకళతో కలిసి ఉంటున్నాడు. ముగ్గురూ ఒకే ఇంటిలో ఉండేవారు. రంజిత్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పనుల నిమిత్తం హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉండేవాడు.
 
తల్లి వద్దే తన భార్యను వదిలి వెళ్లేవాడు రంజిత్. నెలకు రెండురోజులు మాత్రమే భార్యతో కలిసి ఉండేవాడు. నిత్యం భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్లిపోవడంతో భార్య భాను విరహాన్ని తట్టుకోలేకపోయింది. నెల రోజుల క్రితం తన ఇంట్లో టివి పనిచేయలేదు. 
 
టివి రిపేరు కోసం రాజు అనే యువకుడు వచ్చాడు. టివిని రిపేర్ చేశాడు. అతనితో కనెక్టయ్యింది భాను. భాను క్లోజ్‌గా మూవ్ కావడంతో రాజు వెనక్కి తగ్గలేదు. ఏకంగా ఇద్దరూ కలిసి రాజు గదిలోనే ఎంజాయ్ చేసేవారు. భర్త ఇంట్లో లేని సమయంలో భాను బయటికి వెళ్లిరావడం.. ఇంట్లో రాత్రి వేళల్లో గంటల తరబడి ఫోన్లు మాట్లాడుతూ ఉండటంతో చంద్రకళకు అనుమానం వచ్చింది.
 
రెండురోజుల క్రితం చంద్రకళను మార్కెట్‌కు పంపిన భాను, రాజును ఇంటికి పిలిపించుకుంది. మార్కెట్ నుంచి వచ్చిన చంద్రకళ ఇంట్లో ఇద్దరు ఉండటాన్ని గమనించింది. భానును హెచ్చరించింది. తన విషయం బయటపడిపోయిందన్న భయంతో ఆదివారం రాత్రి రాజు సహాయంతో నిద్రిస్తున్న చంద్రకళను చంపేసింది భాను. ఆ తర్వాత ఏమీ ఎరుగనట్లు తన భర్తకు ఫోన్ చేసి అత్తయ్య చనిపోయిందని చెప్పింది.
 
ఆరోగ్యంగా ఉన్న తల్లి చనిపోవడమేంటో అర్థం కాని రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం చేయగా హత్యగా తేలడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణం చేశాు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్‌కు వాక్సిన్ తయారు చేస్తున్న చైనా