Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తాగి తొంగునేవారు ప్రజాసేవ చేస్తారా? : నటి ఖుష్బూ

Advertiesment
Khushbu Sundar
, శనివారం, 17 నవంబరు 2018 (09:40 IST)
తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌పై సినీ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఖుష్బూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీకలవరకు మద్యం సేవించి ఫామ్‌హౌస్‌లో సేదతీరేవారు ఎలా ప్రజాసేవ చేస్తారంటూ ఆమె ప్రశ్నించారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్చర్లలో ఆమె విలేకరులోతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రమంటే కేవలం ఆ నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమేకాదన్నారు. ఆ నలుగురు మాత్రమే ఈ నాలుగేళ్లలో కోట్లకు పడగలెత్తారని ధ్వజమెత్తారు. కేవలం నలుగురు వ్యక్తులు నాలుగు కోట్ల మందిని పాలిస్తున్నారనీ, కేసీఆర్ ఫ్యామిలీ నియంతృత్వ పాలనసాగిస్తోందని ఆరోపించారు. 
 
ముఖ్యంగా, కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్కరంటే ఒక్కరు కూడా మహిళా మంత్రి లేరన్నారు. కానీ, ఆయన కుమార్తెకు మాత్రం పార్లమెంట్‌లో పదవులు కావాలన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. 
 
అదేసమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైతే మహిళలకు మంత్రిపదవులు మాత్రమేకాకుండా సముచిత స్థానం కూడా దక్కుతుందన్నారు. తెరాస తరహాలో తమది మాటల పార్టీ కాదని చేతల పార్టీ అని ఆమె గుర్తుచేశారు. గతంలో కేసీఆర్,  తెరాస చేసిన హామీల్లో ఒక్కటి కూడా అమలుకాలేదని ఖుష్బూ చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నందమూరి ఫ్యామిలీతో చంద్రబాబు ఫోటో... తాతా ఎన్టీఆర్ స్ఫూర్తితో వస్తున్నా...