ఓవైపు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. ఆయనకు నలుగురు భార్యలు.. అయినా అమ్మాయిలు అంటే పిచ్చి. ఆర్థిక సాయం చేస్తానంటూ నమ్మించి ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది.
దీంతో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల మొహమ్మద్ సలీమ్ ఉద్దీన్ అనే వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. సలీమ్‌కు నలగురు భార్యలు. వారంతా విదేశాల్లో ఉంటారు.. సలీమ్ కూడా విదేశాల్లోనే ఉండి అమ్మాయిల కోసం తరచూ హైదరాబాద్‌కు వస్తూ ఉంటాడు. నిరుపేద అమ్మాయిలకు ఆర్థిక సహాయం చేస్తానంటూ నమ్మించి ఇంటికి పిలిపించుకుని వారిపై అఘాయిత్యానికి పాల్పడతాడు.
తాజాగా 23 ఏళ్ల యువతిపై కన్నేసిన సలీమ్.. ఆర్థిక సహాయం పేరుతో ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం ఆ యువతికి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన బాలిక.. పూర్తి ఆధారాలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది.
భరోసాలో విచారణ అనంతరం ఆ యువతి కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో, యువతి ఇచ్చిన ఫిర్యాదుపై సలీమ్ ఉద్దీన్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు.. ఆర్థిక సహాయం చేస్తానంటూ పలువురు అమ్మాయిలపై సలీమ్ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.