Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 5 April 2025
webdunia

రూ. 4000 పెన్షన్ కావాలా? ఐతే ఈ పని చేయాలంటున్న రేవంత్ సర్కార్

Advertiesment
Cheyutha
, బుధవారం, 27 డిశెంబరు 2023 (14:09 IST)
తెలంగాణలో ఏర్పడ్డ కొత్త సర్కార్ తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా అర్హులైనవారికి చేయూత పథకం కింద రూ. 4000 ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకుగాను అర్హులైనవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
 
డిశెంబరు 28 నుంచి జనవరి 6 వరకూ రేవంత్ సర్కార్ నిర్వహించే ప్రజాపాలనలో అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచన చేసింది. ఐతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తిరిగి మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలియజేసింది. అలాగే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అద్భుతమైన ఫీచర్లు.. గెలాక్సీ ఏ25 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ధర వివరాలు