తెలంగాణ సర్కారు కొలువుదీరిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజైన డిసెంబర్ 9 నుంచి అమలు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
తొలి కేబినెట్ సమావేశానికి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ కొనసాగిస్తామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో విద్యుత్‌కు అంతరాయం కలగకుండా చూసుకుంటామని శ్రీధర్ బాబు తెలిపారు.
ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపుతో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం గ్యారెంటీలను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 9 నుంచి.. ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించొచ్చని స్పష్టం చేశారు.