Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

Advertiesment
Black Dogs

సెల్వి

, సోమవారం, 10 మార్చి 2025 (11:46 IST)
ఫిబ్రవరి 22న జరిగిన విషాద ఘటనలో ఎనిమిది మంది అదృశ్యమైన నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలోని ఎస్‌ల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారానికి సహాయక చర్యలు ప్రారంభమై 17రోజులైనాయి. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం మొదటి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రెస్క్యూ బృందం సోమవారం మరో రెండు మృతదేహాలను గుర్తించింది. మొదటగా వెలికితీసిన మృతదేహం టన్నెల్ బోరింగ్ మెషిన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది అని గుర్తించారు. 
 
గురుప్రీత్ సింగ్ అవశేషాలు కనుగొనబడిన ప్రదేశంలోనే తాజా రెండు మృతదేహాలు కనుగొనబడ్డాయి. కేరళ నుండి శునకాలను రప్పించిన తర్వాత సహాయక చర్యలలో పురోగతి గమనించబడింది. కేరళ పోలీసు విభాగానికి చెందిన ఈ ప్రత్యేకంగా శిక్షణ పొందిన శునకాలు, భూగర్భంలో 15 అడుగుల లోతు వరకు పాతిపెట్టిన మానవ అవశేషాలను గుర్తించగలవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Gujaratis: ఆర్థిక రంగంలో గుజరాతీయులదే ఆధిపత్యం.. కారణం ఏంటి?