Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

Advertiesment
telangana assembly

ఠాగూర్

, గురువారం, 4 జనవరి 2024 (16:59 IST)
తెలంగాణాలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసి సీనియర్ నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డిలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా గెలవడంతో రాజీనామా చేయడంతో ఈ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 29వ తేదీన ఎన్నికలు నిర్వహించి, ఫిబ్రవరి ఒకటో తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. 
 
ఈ నెల 11వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభమవుతుంది. 18వ తేదీన నామినేషన్లు గడువు ముగియనుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఇస్తారు. 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 
 
అందంగా ఉన్నారు... వయసు తక్కువగా ఉంది.. రెండో పెళ్లి చేసుకుంటారా? 
 
నటి మీనా మొదటి భర్త సాగర్ అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో ఆమె రెండో పెళ్ళి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుంది. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇపుడు మరోమారు ఓ విలేకరి అడిగిన తిక్క ప్రశ్నకు సూటిగా సుత్తిలేకుండా బదులిచ్చారు. అందంగా ఉన్నారు.. వయుసు కూడా తక్కువగానే ఉంది. రెండో పెళ్లి చేసుకుంటారా? అని విలేకరి పదేపదే ప్రశ్నించడంతో దానికి మీనా సమాధానమిచ్చారు. 
 
"మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన నాకు ఇపుడైతే లేదు. ఎవర్నీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతావా? అంటే అలా చాలా మంది ఉంటున్నారు కదా. అలాగే నేను వాళ్లలాగే ఉంటానని కాదు. ఎవరి పరిస్థితి వాళ్లది. నా జీవితం గురించి నేనెపుడూ ఆలోచన చేయలేదు. అలాగే, ముందుగా ఏదీ ప్లాన్ చేసుకోలేదు. తక్కువ వయసు, ఎక్కువ వయసు అని కాదు. నా భవిష్యత్ గురించి నేను ఊహించలేను. నేను కాదు. ఎవరూ ఊహించలేరు. ముందు నా జీవితం గురించి కాకుండా కూతురి గురించి ఆలోచిస్తున్నాను. సినిమాల్లోకి వస్తానని, ఇంత పెద్ద హీరోయిన్ అవుతానని నేను ఎన్నడూ అనుకోలేదు. 
 
తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సరసన నటిస్తానని ఊహించలేదు. జీవితం ఇలాగే ఉంటుందని అనుకోలేను పెళ్లి కూడా అంతే. అపుడు, ఇపుడు అని చెప్పలేదు. అలాగని ఒంటరిగా ఉండిపోతానని చెప్పలేను. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇపుడు నేను ఆలోచిస్తున్నది నా కూతురు గురించి మాత్రమే. నా కంటే నా కుమార్తె నాకు ముఖ్యం. నా సుఖం, నా సంతోషం మాత్రమే కాదు. నాఫస్ట్ ప్రియారిటీ నా కుమార్తె. ఇది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి వెయిట్ చేయడమే. పెళ్లి గురించి ఏమి ఊహించి చెప్పలేను" అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోరున విలపించిన మంత్రి అమర్నాథ్... అనకాపల్లిని వదిలి వెళ్లడం ఇష్టం లేదంటూ...