Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎక్కడ చూసినా డబ్బే.. రూ.35.50 లక్షలతో కూడిన బ్యాగ్ స్వాధీనం

cash notes

సెల్వి

, సోమవారం, 1 ఏప్రియల్ 2024 (15:12 IST)
తెలంగాణలో భారీ లక్షల నగదు ఎన్నికల వేళ పట్టుబడుతోంది. తాజాగా ఆర్పీఎఫ్ సిబ్బంది సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని రూ.37,50,000 నగదు ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. మహేష్ ఎం భగవత్, ఐపీఎస్, రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీపీ, సాయేశ్వర్ గౌడ్, ఐఆర్పీ/ఎస్సీ తన సిబ్బందితో పాటు ఆర్పీఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాధారణ ఎంపీ ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించారు. 
 
తనిఖీల సమయంలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫాం నెం.01లోని మిడిల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద గేట్ నంబర్ 03 దగ్గర బ్యాగ్‌తో తమిళనాడులోని మధురాంతకం, కాంచీపురంకు చెందిన పి లక్ష్మణ్ రామ్ (45) అనే వ్యక్తిని వారు పట్టుకున్నారు. 
 
నికర నగదు రూ.37,50,000/- ఉన్న అతని బ్యాగ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత విచారణలో అతను సరైన పత్రాలను కలిగి వుండలేదు. ఇంకా ఆ నగదు గురించి సరైన సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ నగదును తదుపరి చర్యలు తీసుకోవడానికి సరైన రసీదు కింద ఆదాయపు పన్ను శాఖ, ఆయకార్ భవన్, హైదరాబాద్‌కు అందజేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆక్రమణ అరుణాచల్ ప్రదేశ్‌ ప్రాంతాలకు డ్రాగన్ కంట్రీ కొత్త పేర్లు.. మే నెల నుంచి అమల్లోకి...