Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

KCR in Assembly: కేసీఆర్ అసెంబ్లీకీ రావాలి.. రేవంత్ రెడ్డి

kcrao

సెల్వి

, ఆదివారం, 8 డిశెంబరు 2024 (10:20 IST)
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి 64 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. బీజేపికి 8, ఎంఐఎం పార్టీకి 7, సీసీఐ ఒక్క స్థానాల్లో విజయం సాధించింది.
 
గత యేడాది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపారు. ఇప్పటికే 11 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీ విధానాలపై గొంతెత్తుతుంది. ఇప్పటికే హైడ్రా, మూసీ ప్రక్షాళన సహా పలు అంశాలపై ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తోంది.
 
ఈ నేపథ్యంలో తాజాగా జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలపై అందరి దృష్టి కేసీఆర్‌పైనే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకీ వస్తారా లేదా అని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 
 
గత అసెంబ్లీ సమావేశాలకు కూడా గులాబీ బాస్ హాజరు కాలేదు. దీంతో తాజాగా కేసీఆర్ అసెంబ్లీకీ రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకీ వస్తే అధికార ప్రతిపక్షాల మధ్య వార్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి నెలకొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Addanki Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. కొత్తకారుకు పూజలు చేసి వస్తుండగా? (video)