Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో.. కవిత శరత్ చంద్రరెడ్డిని బెదిరించి రూ.80లక్షలు తీసుకుందా?

Advertiesment
kavitha

సెల్వి

, శనివారం, 13 ఏప్రియల్ 2024 (14:01 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టయిన కేసీఆర్ తనయ కవితను విచారిస్తుంటే నిజాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో మరోసారి సీబీఐ ద్వారా అరెస్ట్ అయిన ఆమెను సిబీఐ అధికారులు ఈరోజు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. 
 
ఈ సందర్భంగా సీబీఐ రిమాండ్ రిపోర్టులో అనేక కొత్త విషయాలను బయటపెట్టింది. వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి బంధువు, అరబిందో ఫార్మా అధినేత శరత్ చంద్రరెడ్డిని బెదిరించి కవిత రూ.80 లక్షలు ముడుపులు తీసుకున్నారట.

అడిగినంత డబ్బు ముట్టజెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో వారి ఫార్మా కంపెనీ, వ్యాపారాలు ఎలా నడుస్తాయో చూస్తానని బెదిరించడంతో ఆయన గత్యంతరం లేక ఆ సొమ్ముని ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి సంస్థ ఖాతాలో జమ చేశారట. 
 
ఆ తర్వాత మహబూబ్ నగర్‌లో లేని వ్యవసాయ భూమిని ఆయన చేత కొనిపించిన్నట్లు నకిలీ భూపత్రాలతో మరో 14 కోట్లు గుంజారని సీబీఐ నివేదికలో పేర్కొంది. ఆ తర్వాత మళ్ళీ మరో 25 కోట్లు వసూలు చేసేందుకు కల్వకుంట్ల కవిత ప్రయత్నించారని నివేదికలో సీబీఐ పేర్కొంది. 
 
అంతేగాకుండా.. మరో వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కూడ కల్వకుంట్ల కవిత రూ.50 కోట్లు ఇవ్వాలని బెదిరించారని కానీ ఆయన రూ.25 కోట్లకు ఆమెను ఒప్పించి కొడుకు రాఘవ్ రెడ్డి ద్వారా ఆమెకు చెల్లించారని సీబీఐ నివేదికలో పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంటర్‌లో కర్నూలు విద్యార్థిని నిర్మల టాప్, విషెస్ చెప్పిన Ministry of Education