Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాతో వస్తే రూ. 500 ఇస్తా, ఆశపడి వెళ్లిన స్త్రీని అనుభవించి హత్య చేసాడు

Advertiesment
crime

ఐవీఆర్

, బుధవారం, 29 జనవరి 2025 (13:09 IST)
తెలంగాణలోని మేడ్చల్ పరిధిలో కల్వర్ట్ కింద గుర్తుపట్టలేని విధంగా ఓ మహిళ హత్య చేయబడి వుంది. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు విషయాన్ని పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలు ఆనవాళ్లు గుర్తించలేకపోయారు. కారణం... ఆమె ముఖం బండరాయితో మోది ఛిద్రం చేయబడి వుంది. పెట్రోల్ పోసి ఆమె శరీరాన్ని దహనం చేసిన ప్రయత్నంలో పాక్షికంగా కాలిపోయి వుంది.
 
ఐతే పోలీసులు ఆమెకి సమీపంలో పడి వున్న కండోమ్ సేకరించారు. వివాహేతర సంబంధం వల్ల ఈ దారుణం జరిగి వుంటుందని ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. ఇంకా ఆమెకి సంబంధించిన సెల్ ఫోను స్వాధీనం చేసుకుని అందులోని కాల్ డేటా తీయడంతో నిందితుడు దొరికిపోయాడు. అతడి వద్ద పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో వాస్తవాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి.
 
హత్యకు గురైన మహిళ స్వస్థలం నిజామాబాద్ జిల్లా బోధన్ దగ్గరలోని సెట్టిపేట. ఆమె తన భర్తతో విడిపోయి హైదరాబాదులోని కుషాయిగూడలో వుంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమె 24వ తేదీన పని కోసం మేడ్చల్ బస్టాండు వద్ద నిలబడి వుంది. ఆమెను చూసిన ఇమామ్ అనే వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు.
 
తనతో గడిపితే రూ. 500 ఇస్తానంటూ చెప్పాడు. దానికి అంగీకరించిన మహిళ అతడితో కలిసి కొంతదూరంలో వున్న కల్వర్ట్ కింద గడిపారు. ఆ తర్వాత సదరు మహిళ తనను అధికంగా డబ్బు అడగడంతో ఆమెను హత్య చేసినట్లు నిందితుడు చెబుతున్నాడు. కానీ మహిళకు ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోవడంతో అతడితో వాగ్వాదానికి దిగి వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ వాదనలో ఆ మహిళను అత్యంత పాశవికంగా హత్య చేసి గుర్తుపట్టకుండా వుండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు నిందితుడు చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 ఏళ్ల వివాహితకు వీడియో కాల్, నేను చనిపోతున్నా లక్ష్మీ: 22 ఏళ్ల ప్రియుడు ఆత్మహత్య