Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారాస నేతల గృహ నిర్బంధాలు... తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు

harish rao

ఠాగూర్

, శుక్రవారం, 6 డిశెంబరు 2024 (12:38 IST)
తెలంగాణ రాష్ట్రంలో విపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితికి చెందిన నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేసారు. దీంతో ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఆ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారాస నేతలు వివిధ రూపాల్లో అడ్డంకులు సృష్టిస్తున్నారు. పైగా, భారాస నేతలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావును కూడా పోలీసులు గురువారం రాత్రి 8 గంటల వరకు పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. మరో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయగా, ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 
 
ఈ క్రమంలో భారాస ఎమ్మెల్యేలు, నేతల అరెస్టులను ఖండిస్తూ ఆ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఎన్టీఆర్‌ మార్గ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు నేతలు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, భారాస ఎమ్మెల్యేలు, నేతల నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 
 
కొంపల్లిలో కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కూకట్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును గృహ నిర్బంధం చేశారు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ మండలంలోని నివాసంలో ఆ పార్టీ నేత శంభీపూర్‌ రాజు, కొండాపూర్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌, రాజేంద్రనగర్‌ బండ్లగూడలో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను హౌస్‌ అరెస్టు చేశారు. మరోవైపు తెలంగాణ భవన్‌ వద్ద పోలీసులు మోహరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Sheikh Mujibur Rahman: బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఏంటది?