Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Co-living PG hostels: ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండొచ్చు... అదీ హైదరాబాదులో?

Advertiesment
Love Couple

సెల్వి

, మంగళవారం, 18 మార్చి 2025 (13:54 IST)
హైదరాబాదులో కో-లివింగ్ కల్చర్ పెరిగింది. ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండొచ్చు. హైదరాబాదులోని ఐటీ ప్రాంతాల్లో పీజీ హాస్టళ్లు కూడా వెలిశాయి. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్‎గా ఎలాంటి తప్పులేదని చెబుతున్నా.. ఈ కో లివింగ్ రిలేషన్స్ ద్వారా దుర్వినియోగం, నేరాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. 
 
చాలామంది యువత తల్లిదండ్రులకు తెలియకుండా ఇలాంటి కో లివింగ్ రిలేషన్స్‎లో ఉంటున్నారు. దీనివల్ల ఇద్దరి మధ్య ఘర్షణలు వచ్చిన సమయంలోనే విషయాలు వెలుగు చూస్తున్నాయి. 
 
అయితే ఈ కల్చర్‌ మంచిది కాదన్నది సామాజిక వేత్తల అభిప్రాయం. ఇప్పటికే కో లివింగ్ హాస్టల్స్‌ హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే.. కో లివింగ్ కల్చర్‎ను కొందరు సమర్ధిస్తే మరికొందరు మత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తప్పుడు కేసుల నుంచి విముక్తి కల్పించండి.. సీఎం బాబును కోరిన నటి జెత్వానీ!!