తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నటి విజయశాంతి ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన తర్వాత శాసనసభ సమావేశాలు తొలిసారి విధానపరంగా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం ఎంతో ఆనందదాయకమన్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర మూడో అసెంబ్లీ సమావేశాలు ఇటీవల ప్రారంభమై సజావుగా సాగుతున్నాయి. దీనిపై విజయశాంతి స్పందిస్తూ, 2014 తర్వాత సమావేశాలు ఇంత సాఫీగా, హుందాగా జరుగుతుండటం ఇదే తొలిసారన్నారు. సచివాలయం కూడా ఇపుడు పూర్తి స్థాయిలో పని చేస్తుందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో దాదాపు దశాబ్దం తర్వాత ప్రజాస్వామ్య పంథాలో పనిచేస్తుందని పేర్కొన్నారు
ఇది ప్రజా ప్రభుత్వమన్నారు. అందువల్ల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రజాస్వామ్య పంథాలోనే నడుస్తుందని, కోట్లాడి మందికి ఇపుడిపుడే విశ్వాసం ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా 26 యేళ్ల పోరాటం తర్వాత మీ రాములమ్మ ఇపుడు ఏం చేయాలని ఎవరైనా తనను అడిగితే.. తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలని, ఈ భూమి బిడ్డల భవిష్యత్ ఎప్పటికీ బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోలుకుంటానని విజయశాంతి పేర్కొన్నారు.