Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డు

Advertiesment
laddu

వరుణ్

, బుధవారం, 17 జనవరి 2024 (11:31 IST)
అయోధ్య రాముడికి సికింద్రాబాద్ నుంచి భారీ లడ్డూ వెళ్లింది. 1265 కేజీల బరువుతో ఈ లడ్డూను సికింద్రాబాద్ నగరానికి చెందిన శ్రీరామ్ క్యాటరర్స్ తయారు చేసింది. ఈ లడ్డూను బుధవారం ఉదయం శోభాయాత్రగా బయలుదేరి వెళ్లింది. ఈ నెల 21వ తేదీ నాటికి ఈ లడ్డూ రాముడి సన్నిధికి చేరుకుంటుందని శ్రీరామ్ క్యాటరర్స్ యజమాని వెల్లడించారు. 
 
రాముడు గుడికి భూమి పూజ జరిగిన నాటి నుంచి ప్రాణప్రతిష్ట ముహూర్తం రోజు వరకు మొత్తం 1265 రోజులు పట్టింది. దీనికి గుర్తుగా శ్రీరామ్ క్యాటరర్స్ 1265 కేజీల బరువుతో ఈ లడ్డూను తయారు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నుంచి ముందుగా అనుమతి పొంది, స్వామి వారికి నైవేధ్యంగా సమర్పించేందుకు ఈ భారీ లడ్డూను సిద్ధం చేసినట్టు శ్రీరామ్ క్యాటరర్స్ యజమాని నాగభూషణం రెడ్డి తెలిపారు. ఈ భారీ లడ్డూతో పాటు మరో ఐదు చిన్న లడ్డూలను కూడా తయారు చేశామని తెలిపారు. ఈ లడ్డూలను అయోధ్యకు చేర్చేందుకు బుధవారం శోభాయాత్రను ప్రారంభించగా, ఇది ఈ నెల 21వ తేదీ నాటికి అయోధ్యకు చేరుకుంటుంది. 
 
కాగా, ఈ భారీ లడ్డూ తయారీకి 350 కేజీల శెనగపిండి, 700 కేజీల చక్కెర, 40 కిలోల నెయ్యి, 40 కిలోల కాజు, 30 కిలోల కిస్మిస్, 15 కేజీల బాదం, 10 కేజీల పిస్తా, 32 గ్రాముల కుంకుమ పుప్వును వినియోగించినట్టు ఆయన వివరించారు. ఈ లడ్డూను శ్రీరాముడి గుడికి 50 మీటర్ల దూరంలో ప్రదర్శనకు ఉంచుతారని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ప్రసాదం పంచుతారని ఆయన వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిక్షా తొక్కిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు.. ఎవరతను?