Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీ లెక్క మేం లంగతనం చేయం.. దొబ్బితినం.. కాంగ్రెస్‌పై కేసీఆర్

Advertiesment
KCR
, గురువారం, 29 నవంబరు 2018 (15:42 IST)
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఈ ప్రచారంలో తెరాస అధినేత కేసీఆర్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ ప్రచారంలో ప్రధానిమంత్రి నరేంద్ర మోడీతో పాటు కాంగ్రెస్, టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు.
 
ముఖ్యంగా, గతంలో తెరాస ఇచ్చిన మేనిఫెస్టోల్లో ఒకటైని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎక్కడ అంటూ విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. వీటికి కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏమాయే కేసీఆర్ అంటరు. మీ లెక్క మేం లంగతనం చేయం. దొంగలెక్కలు రాసి దొబ్బితినం. ఇండ్లు కడుతం అని ఘాటైన సమాధానమిచ్చారు. 
 
అలాగే, నిజామాబాద్, పాలమూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి వచ్చి తనపైనా, తన ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించిన ప్రధాని నరేంద్ర మోడీపై కూడా కేసీఆర్ విమర్శల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రధాని ఈ గడ్డకు వచ్చి పచ్చి అబద్దాలు చెబుతున్నాడు అంటూ మండిపడ్డారు. 
 
'నిజామాబాద్‌ల కరంట్ లేదన్నడు. ఝూటా మాట్లాడిండు. మోడీకి ఏమైనా బీమారీ వచ్చెనా? గట్లెందుకు చెప్పే! పెద్ద పదవిలో ఉన్నోళ్లు.. జాగ్రత్తగా మాట్లాడాలి. నేను గర్వంగా చెప్తున్న.. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్' అని భారత విద్యుత్ఛక్తి ప్రాధికార సంస్థ చెప్పింది. మోడీకి కనపడుతలేదట. కంటివెలుగులో చూపించుకో.. రెండద్దాలు ఇస్త. లోకంలో ఎవ్వర్ని అడిగిన చెప్తరు తెలంగాణలోని కరంటు గురించి. ఆయన ఇంతింత పొడుగు మాటలు మాట్లాడిండు. బాధ కలిగింది అని వ్యాఖ్యానించారు. 
 
మోడీ... దమ్ముంటే అక్కడే ఉండు.. నేను హెలికాఫ్టర్ వేసుకొని వస్త.. అక్కడనే సభపెట్టి మాట్లాడుదం అని చాలెంజ్ చేసిన. లేడు.. ఎల్లిపోయిండు. ఇయ్యాల 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఒక్క రాష్ట్రంలోనైనా వేయి రూపాయల పింఛన్ ఇస్తున్నదా? రైతుబంధు అమలుచేస్తున్నరా? కల్యాణలక్ష్మి, రైతుబీమా ఉన్నయా? ఈడికివచ్చి అడ్డంపొడుగు మాట్లాడితే మేము ఏమైనా గొర్రెలమా? పిచ్చోల్లం ఉన్నమా? అగ్గవకు దొరికినమా? అంటూ మాటలతూటాలు పేల్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసులను అల్లాడించిన గోషామహల్ ఎమ్మెల్యే అభ్యర్థి ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి