Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు: చంద్రబాబు

Advertiesment
కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు: చంద్రబాబు
, బుధవారం, 28 నవంబరు 2018 (16:21 IST)
కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఒకే వేదికను పంచుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ప్రజా కూటమి విజయాన్ని ఆకాంక్షిస్తూ.. ఖమ్మంలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. 


ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, గద్దర్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర మహాకూటమి నేతలు హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఏపీ సీఎ చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం అపహాస్యమందని చెప్పారు. దేశం బాగుంటేనే మనమంతా బాగుంటామని పునరుద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధికి తానెప్పుడూ అడ్డపడలేదన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు మోదీకి వ్యతిరేకంగా పనిచేయాల్సి వుందని పిలుపునిచ్చారు. సీబీఐ, ఆర్బీఐ, గవర్నర్ వ్యవస్థలన్నింటినీ దెబ్బతీశారు. జీఎస్టీతో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని మండిపడ్డారు. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారో అర్థం కావట్లేదు. అసలు తానేం తప్పు చేశానో తెలియట్లేదన్నారు. దేశంలో రెండే ఫ్రంట్‌లు వున్నాయని.. అందులో ఒకటి ఎన్డీయే ఫ్రంట్, ఇంకోటి ఎన్డీయే వ్యతిరేక ఫ్రంట్ అంటూ చంద్రబాబు తెలిపారు. ప్రజా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2.0 మరియు PSLV-C43... రెండూ ఒకేసారి, శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్(Video)