Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వంకాయ బాదం హల్వా

Advertiesment
వంటకాలు స్వీట్లు వంకాయలు పంచదార బాదంపప్పు వరిపిండి నెయ్యి యాలక్కాయలు మిఠాయి రంగు పాలు
కావలసిన పదార్థాలు :
వంకాయలు... అర కేజీ
పంచదార... పావు కేజీ
బాదంపప్పు... వంద గ్రా.
వరిపిండి... 20 గ్రా.
నెయ్యి... పావు కేజీ
యాలక్కాయలు... 5 గ్రా.
మిఠాయి రంగు... చిటికెడు
పాలు... పావు కప్పు

తయారీ విధానం :
వంకాయలను ఉడికించి తొక్క ఒలిచి, గింజలు తీసేసి పక్కన ఉంచాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి వేడయ్యాక నెయ్యివేసి కరిగించాలి. అందులోనే వరిపిండి వేసి కొద్దిగా రంగు మారేదాకా వేయించాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని వేసి, మెత్తగా అయ్యేదాకా ఉడికించాలి.

ఆ తరువాత అందులోనే పంచదార వేసి మరికాసేపు ఉడికించి మిఠాయి రంగు కలిపిన పాలు పోసి, యాలక్కాయలపొడి కలిపి చిక్కబడేదాకా ఉడికించాలి. చివరగా, ఈ మిశ్రమంలో ముక్కలుగా కోసిన బాదంపప్పును పైన వేసి అలంకరిస్తే నోరూరించే వంకాయ బాదం హల్వా రెడీ అయినట్లే...!

Share this Story:

Follow Webdunia telugu