కావలసిన పదార్థాలు :
బీట్‌రూట్ తురుము...300గ్రా.
బెల్లం తురుము... ముప్పావుకేజి
నెయ్యి... 150గ్రా.
పచ్చిబియ్యం పిండి... ఒకకేజీ
నీళ్లు... తగినన్ని
రీఫైండ్ ఆయిల్... వేయించేందుకు సరిపడా
ఎండుకొబ్బరి తురుము... 200గ్రా.
యాలకులపొడి... ఒకటిన్నర టీ.
తయారీ విధానం :
ముందుగా బీట్‌రూట్ తురుములో కొద్దిగా నెయ్యి వేసి నీళ్ళు ఇగిరే వరకూ వేయించి ఉంచాలి. మందపాటి గిన్నెలో బెల్లం తురుము, తగినన్ని నీళ్లు పోసి తీగపాకం పట్టాలి. ఈ పాకంలో యాలకులపొడి వేసి గిన్నె దించాలి.
తరవాత బూరెలు, అరిసెల తయారీలో మాదిరిగానే పాకంలో ఓ చేత్తో పిండి పోస్తూ మరోచేత్తో తెడ్డుతో వేగంగా పిండి ఉండలు కట్టకుండా తిప్పాలి. ఇలా మొత్తం పిండి వేసిన తరవాత నెయ్యి, బీట్‌రూట్ తురుము, కొబ్బరి తురుము కూడా వేసి బాగా కలిపి 20 నిమిషాలపాటు మూతపెట్టి ఉంచితే పిండి చక్కగా మగ్గుతుంది.
ఇప్పుడు కడాయిలో నూనెపోసి కాగనివ్వాలి. పైన కలిపి ఉంచిన పిండిని చిన్నచిన్న ముద్దలుగా ప్లాస్టిక్ పేపరుమీద బూరెల (బిళ్లలు) మాదిరిగా వత్తి నూనెలో వేసి, వేయించి తీసేయాలి. అంతే బీట్‌రూట్ బూరెలు తయారైనట్లే..! ఎన్నో పోషక విలువలుండే ఈ బీట్‌రూట్ బూరెలు పదిహేనురోజుల వరకూ నిల్వ ఉంటాయి.