రోజర్స్ కప్ మహిళల టెన్నిస్: టైటిల్ దిశగా సెరెనా విలియమ్స్
రోజర్స్ కప్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ టైటిల్ దిశగా దూసుకెళుతున్నది. మూడో రౌండ్‌లో ఆమె 13వ సీడ్ కిర్‌స్టెన్ ఫ్లిప్‌కెన్స్‌ను 6-0, 6-3 తేడాతో చిత్తుచేసింది. సెరెనాకు ఏ దశలోనూ ఫ్లిప్‌కెన్స్ తగిన సమాధానం ఇవ్వలేకపోయింది. ఆస్ట్రేలియా క్రీడాకారిణి సమంతా స్టొసుర్ 1-6, 6-2, 6-3 తేడాతో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలుపొందింది. వింబుల్డన్ చాంపియన్ మరియన్ బర్టోలీ ఈ టైటిల్ సాధించాలన్న ఆశలకు గండిపడింది. మగ్దలేన రిబరికొవా (స్లొవేకియా)తో మూడో రౌండ్‌లో తలపడిన ఆమె తొలి సెట్‌ను 7-6 తేడాతో కైవసం చేసుకుంది.