ఆసియా క్రీడల్లో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న కర్ణాటకకు చెందిన అథ్లెట్ అశ్విని అక్కుంజికి స్పాన్సర్ల కొరత వేధిస్తోంది. వచ్చే 2012లో లండన్‌లో జరిగే ఒలింపిక్ పోటీల్లో పాల్గొని దేశానికి బంగారు పతకం సాధించిపెట్టాలనే కోరిక నెరవేరే సూచనలు కనిపించడం లేదు.
చైనాలో గాంగ్ఝౌ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లో రెండు బంగారు పతకాలు సాధించినప్పటికీ తనను కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ కొరత వేధిస్తోందని ఆమె ఆవేదన చెందుతున్నారు. ఒలింపిక్స్‌లో వ్యక్తిగతంగా బంగారు పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించాలని అశ్విని కోరుకుంటోంది. తన కల నెరవేరాలంటే అందుకు సిద్ధమయ్యేందుకు తనకు తగిన ప్రోత్సాహంతో పాటు.. కార్పొరేట్ స్పాన్సర్లు ముందుకు రావాలన్నారు.