మెంపిస్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీ సెమీస్‌లోకి టాప్‌సీడ్ ఆండీ రాడిక్ దూసుకెళ్లాడు. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో అమెరికన్ సాం కుర్రేను 6-4, 3-6, 6-3 పాయింట్ల తేడాతో రాడిక్ మట్టికరిపించాడు. అద్భుత షాట్లతో కుర్రేను బెంబేలెత్తించిన ఆండీ రాడిక్, ప్రత్యర్థిపై మెరుగైన ఆటతీరును ప్రదర్శించాడు.
మరో క్వార్టర్ ఫైనల్లో బెల్జియన్ క్రిస్టోఫ్ రాకస్‌పై 6-2, 6-3 తేడాతో నెగ్గిన హెవిట్‌తో.. ఆండీ రాడిక్ సెమీస్‌లో తలపడతాడు. గెలుపొందిన సందర్భంగా రాడిక్ మాట్లాడుతూ.. హెవిట్ అద్భుతమైన ఆటగాడని, తన టెన్నిస్ ర్యాంకింగ్స్ మెరుగయ్యేందుకు అతడు తీవ్రంగా శ్రమిస్తాడని చెప్పాడు.
అదే సమయంలో... తన ర్యాంకింగ్స్‌ను కూడా మెరుగుపర్చుకునేందుకు గట్టిపోటీని ప్రదర్శిస్తానని రాడిక్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ ఏడాది టెన్నిస్ సీజన్‌లో రాణిస్తున్నానని అతడు వెల్లడించాడు.
ఇకపోతే.. మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా రెండో సీడ్ జువాన్ మార్టిన్‌ను 7-6, 6-4 తేడాతో రాడిక్ స్టెపానిక్ ఓడించాడు.
అదేవిధంగా.. మహిళల విభాగం సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో, టాప్ సీడ్ డానే కార్లోని, అనే కెథావాంగ్‌పై 6-1, 6-0 తేడాతో గెలుపొందింది. మరో మ్యాచ్‌లో అజారెంకా (బెలారస్), జర్మన్ సబిని లిస్కీను 6-4, 3-6, 7-6 తేడాతో ఓడించింది.