సిడ్నీ ఏటీపీ టైటిల్‌ను నాలుగో సీడ్ డేవిడ్ నల్బాండియన్ కైవసం చేసుకున్నాడు. అంతర్జాతీయ ఏటీపీ టోర్నీ ఫైనల్లో ఫిన్లాండ్‌కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారుడు జార్ఖో నిమినేన్‌పై నల్బాండియన్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు.
మ్యాచ్ మొదటి నుంచే గట్టిపోటీని ప్రదర్శించిన నల్బాండియన్ తొలి మూడు సెట్లలో ఆధిక్యంలో నిలిచాడు. మ్యాచ్ చివరికి 6-3, 6-7 (9/11), 6-2 తేడాతో నల్బాండియన్ గెలుపును కైవసం చేసుకున్నాడు. దీంతో తన టెన్నిస్ కెరీర్‌లో నల్బాండియన్ 20వ ఏటీపీ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా... సోమవారం ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో నల్బాండియన్ పదో సీడ్ టెన్నిస్ క్రీడాకారుడు మార్క్ గిఖేల్‌తో తలపడనున్నాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో గిఖేల్‌తో నల్బాండియన్ బరిలోకి దిగనున్నాడు.