Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాలుగో వన్డేలో టీమ్ ఇండియా ఓటమి: సిరీస్ సమం

నాలుగో వన్డేలో టీమ్ ఇండియా ఓటమి: సిరీస్ సమం
పోర్ట్‌ఎలిజబెత్‌లో జరిగిన నాలుగో వన్డేలో టీమ్ ఇండియా ఓటమిపాలైంది. ఈ వన్డేలో గెలిచి చరిత్ర సృష్టించాలని ఉవ్విళ్లూరిన ధోనీ సేనకు డుమ్నీ, బోథా రూపంలో చుక్కెదురైంది. వీరిద్దరు భారత బౌలర్లను ఉతికి ఆరేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 265 పరుగులు చేసింది. దీనికి తోడు వరుణ దేవుడు అడ్డుపడటంతో భారత్ పరాజయంపాలైంది.

ఒక దశలో 118 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినా... డుమిని, బోథా సహకారంతో మంచి స్కోరు చేసింది. మరోవైపు ప్రారంభంలో పట్టుబిగించిన భారత బౌలర్లు ఆట ద్వితీయార్థంలో చేతులెత్తారు. ఫలితంగా సఫారీలు 250 పైచిలుకు పరుగులు చేయగలిగారు. డుమిని, బోథా సమయోచిత ఆటతీరుతో నాలుగో వన్డేలో సఫారీ జట్టు కోలుకుని భారీ స్కోరు చేసింది.

ఓపెనర్ హషీమ్ ఆమ్లా (69 బంతుల్లో 64; ఫోర్లు 8) మంచి ఆరంభాన్నివ్వగా... మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ డుమిని (72 బంతుల్లో 71 నాటౌట్; ఫోర్లు 2, సిక్స్ 1 ), బోథా (59 బంతుల్లో 44, మూడు ఫోర్లు)లు కష్టకాలంలో జట్టును ఆదుకున్నాడు. ఫలితంగా స్థానిక సెయింట్ జార్జి పార్క్‌లో జరిగిన నాలుగో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో యువరాజ్ సింగ్ మూడు వికెట్లు, నెహ్రా ఒక వికెట్ తీయగా, ముగ్గురు ఆటగాళ్లను భారత ఫీల్డర్లు రనౌట్లు చేయడం గమనార్హం. అనంతరం 266 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు సఫారీ పేసర్ల నుంచి కష్టాలతో పాటు వర్షం కూడా వెంటాడింది.

రెండు సార్లు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం భారత్ 48 పరుగుల తేడాతో ఓడింది. ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమమైంది. మ్యాచ్ ముగిసే సమయానికి భారత్ 32.5 ఓవర్లలో 142/6 స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ మాత్రమే 87 (నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Share this Story:

Follow Webdunia telugu