Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాషెస్ చివరి టెస్ట్: ఆస్ట్రేలియా బ్యాటింగ్- స్కోర్ 111/2

Advertiesment
యాషెస్ చివరి టెస్ట్: ఆస్ట్రేలియా బ్యాటింగ్- స్కోర్ 111/2
, సోమవారం, 3 జనవరి 2011 (09:41 IST)
ఇప్పటికే ప్రతిష్టాత్మక యాషెస్‌ను ఇంగ్లండ్ జట్టు నిలబెట్టుకుంది. అయినప్పటికీ అలక్ష్యం ప్రదర్శించకుండా చివరి టెస్టులోనూ నెగ్గి ఆసీస్‌పై పూర్తి ఆధిక్యతను ప్రదర్శించాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక సిడ్నీ క్రికెట్ మైదానంలో ఇరు జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు టీ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఓపెనర్లు వాట్సన్ (45), హౌ (31)లు మంచి శుభారంభమే ఇచ్చారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఆ తర్వాత రికీ పాటింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఖ్వాజా ఓపెనర్ వాట్సన్‌కు మంచి సహకారం అందించారు. ఫలితంగా వీరిద్దరు కలిసి రెండో వికెట్‌‍ యాభై పరుగులు జోడించారు. ఆ సమయంలో ట్రీమ్‌లెంట్ వేసిన అద్భుతమైన బంతికి స్ట్రాస్‌కు వాట్సన్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో టీ సమయానికి ఆసీస్ 111 పరుగులు చేసింది.

ఇదిలావుండగా, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు ఇప్పటికే 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెల్సిందే. 1987 తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆసీస్ గడ్డపై మళ్లీ యాషెస్ సిరీస్‌ను గెలుచుకోలేదు. ఈ ఘనతను సాధించడం ద్వారా ఇంగ్లండ్ జట్టుకు మరో లాభం కూడా ఉంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్ హోదాకు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది.

ఇకపోతే.. గాయం కారణంగా కెప్టెన్ రికీ పాంటింగ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తన కెరీర్‌లో తొలిసారిగా టెస్టు జట్టుకు కెప్టెన్‌గా మైకేల్ క్లార్క్ వ్యవహరించనున్నాడు. అలాలగే, చివరి టెస్టులో ఆసీస్ జట్టులో ఇద్దరు కొత్తముఖాలకు చోటు కల్పించారు. స్పిన్నర్ మైకేల్ బీర్, పాక్‌లో జన్మించిన బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖ్వాజా తొలి టెస్టు ఆడనున్నారు. బీర్ ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం మాత్రమే ఉంది.

24 ఏళ్ల ఖ్వాజా ఆసీస్ జట్టులో తొలి ముస్లిం క్రికెటర్. పాంటింగ్ గాయంతో తప్పుకోవడంతో ఖ్వాజాకు అవకాశం దక్కింది. కీలక మూడో నెంబర్ స్థానంలో ఆడనున్నాడు. షేన్‌వార్న్ రిటైర్మెంట్ తర్వాత జట్టులోకి వచ్చిన పదో స్పిన్నర్ బీర్. సిడ్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న బీర్ ప్రదర్శనపై కెప్టెన్ క్లార్క్ మంచి నమ్మకమే పెట్టుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu