Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం: సిరీస్ సమం

మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం: సిరీస్ సమం
, సోమవారం, 20 డిశెంబరు 2010 (09:43 IST)
యాషెస్ టెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారులు 1-1తో సమం చేశారు. తొలి టెస్టు డ్రాగా ముగియగా, రెండో టెస్టును ఇంగ్లండ్ గెలుచుకున్న విషయం తెల్సిందే. మూడో టెస్టులో ఆసీస్ విజయకేతనం ఎగురవేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా జాన్సన్ ఎన్నికయ్యాడు. నాలుగో టెస్టు ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

స్ఫూర్తిదాయక ఆటతీరుతో ఆస్ట్రేలియా జట్టు... పాంటింగ్ 36వ పుట్టిన రోజు నాడు తమ కెప్టెన్‌కు ఘనమైన బహుమతిని ఇచ్చింది. మూడో టెస్టులో 267 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇక రెండు జట్లూ బాక్సింగ్‌డే (డిసెంబర్ 26) రోజున ప్రారంభమయ్యే నాలుగో టెస్టుపై దృష్టి సారించాయి.

వాకా మైదానంలో ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఆస్ట్రేలియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 391 పరుగుల విజయ లక్ష్యాన్ని ఎదుర్కొన్న ఇంగ్లండ్ ఒక రోజు ముందే... కేవలం 37 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌట్ కావడం గమనార్హం.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ట్రాట్ చేసిన 31 పరుగులే అత్యధికం. మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 81/5తో నాలుగో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం పది ఓవర్లలోనే మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. హారిస్ ఆరు వికెట్లు తీసుకోగా... జాన్సన్ మూడు వికెట్లు నేలకూల్చాడు.

అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 187 పరుగులకే ఆలౌట్ అయింది. ఆతర్వాత ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 309 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 123 పరుగులకే కుప్పకూలడంతో 391 పరుగుల విజయలక్ష్యం నిలిచింది.

Share this Story:

Follow Webdunia telugu